NLG: నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డుకు చెందిన సైదులు ఇల్లు దగ్ధమైంది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వేముల వీరేశం వారి నివాసానికి వెళ్లి దగ్ధమైన ఇంటిని పరిశీలించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… సైదులు ఇళ్లు దగ్ధం అవడం చాలా బాధాకరమైన విషయం అని, బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు.