NGKL: అన్నదానం అన్ని దానాల కంటే ఎంతో గొప్పదని ఎస్సై మాధవరెడ్డి అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కల్వకుర్తి ఆధ్వర్యంలో కల్వకుర్తి పట్టణంలో గురువారం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. లైన్స్ క్లబ్ ద్వారా ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు.