KMR: ప్రమాదవశాత్తు ఆటోబోల్తా పడిన ఘటనలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన KMR పట్టణంలో చోటుచేసుకుంది. లింగంపేట మండలం సూరాయిపల్లి గ్రామానికి చెందిన 15 మంది కూలీలు భిక్కనూరు మండలం అంతంపల్లి గ్రామంలో వరి నాట్లు వేసి తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను స్థానికులు 108 అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించారు.