కర్నూలు జిల్లా ఆలూరులో బీజేపీ కిసాన్ మోర్చా నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. జిల్లా అధ్యక్షులు అక్కమ్మతోట రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని రైతులు, ప్రజల కోసం కొత్త సేవా కార్యక్రమాలను ప్రకటించారు. కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా బసవరాజ్, కార్యదర్శిగా శ్రీధర్ బాధ్యతలు స్వీకరించారు.