AP: విద్యుత్ ఛార్జీలపై సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్ చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి యూనిట్ విద్యుత్ రూ.5.19గా ఉందన్నారు. దానిని రూ.4.90కి తీసుకొచ్చినట్లు తెలిపారు. అలాగే, మార్చి నాటికి మరో 10 పైసలు తగ్గించి రూ.4.80కి తెస్తామని చెప్పారు. 2029కి యూనిట్‌కు రూ.1.19 తగ్గించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు.