KMR: ప్రమాదవశాత్తు ఆటోబోల్తా పడిన ఘటనలో 15 మంది తీవ్రంగా గాయపడగా ఒకరు మృతి చెందిన ఘటన KMR పట్టణంలో చోటుచేసుకుంది. లింగంపేట మండలం సూరాయిపల్లి గ్రామానికి చెందిన 15 మంది కూలీలు భిక్కనూరు మండలం అంతంపల్లి గ్రామంలో వరి నాట్లు వేసి తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను స్థానికులు 108 అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించారు.