SRPT: తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటాలో రాజీ పడేది లేదని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కృష్ణ, గోదావరి నదుల జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన వాటాలో ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోబోమని తెలిపారు. ఈ వాటా కోసం సుప్రీం కోర్టు, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర జల సంఘం, నది ట్రిబ్యునల్స్ ముందు బలమైన వాదనలు వినిపించి సాధిస్తామన్నారు.