NLG: ఆటో డ్రైవర్ల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నకిరేకల్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. డ్రైవర్లకు ఆటో యూనియన్ వారి గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… యువకులు స్వయం ఉపాధి మార్గాన్ని ఎంచుకోవడం అభినందనీయమని అన్నారు.