SS: పుట్టపర్తి హిల్ వ్యూ స్టేడియంలో సత్యసాయి పాఠశాల విద్యార్థుల వార్షిక క్రీడా మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం విద్యార్థులు చేసిన సాహస విన్యాసాలు, సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.