ATP: రాయదుర్గం ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని MLA కాలవ శ్రీనివాసులు శుక్రవారం దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ హరి జవహర్ లాల్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. గతంలో టీటీడీ నిధులతో ప్రారంభమైన పనులు ప్రస్తుతం 40 శాతం పూర్తయ్యాయని అన్నారు. నిలిచిపోయిన ప్రాకారం పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కోరారు.