KMM: కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు చెప్పుకుంటూ పోతే ఈ దేశంలో ఇంకో పార్టీ పుట్టేదే కాదు, మరో పార్టీకి భవిష్యత్తు ఉండేది కాదు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం ఆయన మధిర మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లిలో కాంగ్రెస్ కీలక నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ఇతర పార్టీల లాగా గొప్పలు చెప్పుకోము అని అన్నారు.