అశ్లీల, అసభ్యకర దృశ్యాల రూపకల్పనకు గ్రోక్ (చాట్‌బాట్) దుర్వినియోగం అవుతుండటంపై ఇటీవల పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైంది. ఈ క్రమంలోనే ‘X’ చర్యలు చేపట్టింది. ఈ చాట్‌బాట్‌లోని ఇమేజ్ జనరేషన్ ఫీచర్‌పై పరిమితులు విధించింది. కేవలం సబ్స్క్రైబర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుందని వెల్లడించింది.