W.G: డీవైఎఫ్ఐ 43వ సంక్రాంతి యువజనోత్సవాల్లో భాగంగా దుంపగడప వీవీ గిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణంలో మూడు నియోజకవర్గాల స్థాయి క్రికెట్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గేదెల ధనుష్ జెండా ఆవిష్కరించగా, అంబటి రమేష్ బ్యాటింగ్ చేసి పోటీలను ప్రారంభించారు. జూద క్రీడలకు వ్యతిరేకంగా యువతను క్రీడల వైపు నడిపించడమే లక్ష్యమని నేతలు తెలిపారు.