AP: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నెయ్యి కల్తీ చేసిన కంపెనీలకు అనుకూలంగా వ్యవహరించడంలో లంచం తీసుకున్నట్లు డెయిరీ నిపుణుడు విజయభాస్కర్ రెడ్డి అంగీకరించారు. ఈ కేసులో ఆయన A34గా ఉన్నారు. అయితే ముందస్తు బెయిల్ కోసం నెల్లూరు ACB కోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రమంలో APP వాదనలతో ఏకీభవించి బెయిల్ పిటిషన్ను కోర్టు డిస్మిస్ చేసింది.