తిరుపతి రూరల్ చెర్లోపల్లిలోని బడి వైన్స్లో దొంగతనం జరిగింది. దుండగులు పైకప్పు పగలగొట్టి లోపలికి ప్రవేశించి, క్యాష్ కౌంటర్లో ఉన్న రూ. 2,88,000 నగదును దోచుకెళ్లారు. వైన్స్ మేనేజర్ తులసి రామ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుపతి రూరల్ ఎస్సై శ్రీరాములు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.