ADB: ప్రభుత్వ ఆసుపత్రిలోనే సురక్షిత కాన్పు జరుగుతుందని మండల వైద్యాధికారి డాక్టర్ నిఖిల్ రాజ్ అన్నారు. భీంపూర్ మండలంలోని కరంజి(టీ) గ్రామంలో శుక్రవారం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి గర్భిణీలు, బాలింతలు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. పోషకాహార ప్రాధాన్యత, వివాహవయస్సు, మాతాశిశు సంరక్షణ గూర్చి గ్రామస్తులకు అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు.