GDWL: మే నెలలో జరగనున్న NEET ప్రవేశ పరీక్షలకు జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. గద్వాలలోని ప్రభుత్వ, మహిళా జూనియర్ కళాశాలలను అదనపు ఎస్పీ శంకర్‌తో కలిసి ఆయన సందర్శించారు. పరీక్ష కేంద్రాల్లో వెలుతురు, తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యాలను పరిశీలించి, నిబంధనల మేరకు అన్ని వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు.