PDP: ధర్మారం మండల తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఇంతియాజ్ అలీని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ శ్రీహర్ష శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో పెద్దపల్లిలో జూనియర్ అసిస్టెంట్, రికార్డుల నిర్వహణ అధికారిగా పనిచేస్తున్న సమయంలో రెవెన్యూ పహానిలో పేరు తప్పుగా అనధికారికంగా నమోదు చేయడంతో సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు.