కృష్ణా: గుడివాడలో 13వ వార్డులో మున్సిపల్ కమిషనర్ మనోహర్ ఈరోజు పర్యటించారు. రోడ్డు సంబంధిత PGRS ఫిర్యాదును పరిశీలించి, సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. అనంతరం గంగానమ్మ గుడి ప్రాంతంలో త్రాగునీటి సరఫరా, నీటి కాలుష్య పరిస్థితులను పరిశీలించి, స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.