KRNL: గూడూరు పట్టణంలోని కటిక వీధిలో ఒక ఇంట్లో దుండగులు దొంగతనానికి పాల్పడి 1.5 తులాల బంగారాన్ని అపహరించారు. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, క్లూజ్ టీమ్ ఫింగర్ ప్రింట్ ఆధారాలను సేకరించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజకుళ్లాయప్ప గురువారం తెలిపారు.