SRPT: హుజూర్‌నగర్‌లో 2013లో ప్రారంభమైన సింగిల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రాజెక్ట్‌కు దాదాపు పుష్కరకాలం తర్వాత కదలిక రావడంతో నిరుపేదల్లో ఆశలు చిగురిస్తున్నాయి. తాజాగా అప్లికేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండటంతో పేదలకు కలిసిరానున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా ఎన్నికల తరువాత అర్హులకు ఇళ్లు కేటాయించే అవకాశం ఉంది.