TG: వాహనదారులకు రాష్ట్రప్రభుత్వం శుభవార్త చెప్పింది. RTA కార్యాలయాలకు వెళ్లే అవసరం లేకుండా ఇకపై డీలర్ల వద్దనే వ్యక్తిగత వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించింది. గతంలో డీలర్లు టెంపరరీ రిజస్ట్రేషన్(TR) మాత్రమే ఇచ్చేవారు. శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం RTA కార్యాలయాల్లో ముడుపులు చెల్లిస్తేనే.. పనులు జరుగుతున్నాయన్న విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.