ATP: గుత్తి పట్టణంలో రోజురోజుకు గ్యాస్ కష్టాలు పెరిగిపోతున్నాయి. గ్యాస్ కోసం గ్యాస్ ఏజెన్సీల వద్ద ప్రజలు సిలిండర్లతో శుక్రవారం క్యూలైన్లో నిలబడ్డారు. గ్యాస్ బుకింగ్ చేసుకున్న వారికి సెల్ ఫోన్కు ఓటీపీలు వస్తేనే గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. మరోపక్క గ్యాస్ సిలిండర్లు దొరకక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.