ASF: బెజ్జూర్ మండలం మర్తిడి శివారులో గల భూముల కొలతలను వెంటనే నిలిపివేయాలని శుక్రవారం రైతులు డిమాండ్ చేశారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే అధికారులు సర్వే చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వందేళ్లుగా తాము సాగు చేసుకుంటున్న భూములపై కోర్టులో కేసు పెండింగ్లో ఉందని, ఇలాంటి సమయంలో సర్వే చేయడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. అనంతరం MROకు వినతిపత్రం అందజేశారు.