నెల్లూరులో పొగమంచు రోజురోజుకీ ప్రమాదకరంగా మారుతోంది. గత నెలలో మాత్రమే 67 రోడ్డు ప్రమాదాలు జరగగా, అందులో 33 మంది ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలోని జాతీయ రహదారులపై ఇప్పటికే 51 బ్లాక్ స్పాట్స్ గుర్తించారు. ఇలాంటి పరిస్థితుల్లో అత్యవసరం ఉంటే తప్ప ప్రయాణం చేయకపోవడం మంచిది. పొగమంచు సమయంలో రోడ్డు పక్కన వాహనాలను పార్క్ చేయడం చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.