TG: శంషాబాద్ విమానాశ్రయంలో 2 విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు. వారణాసిలో వాతావరణం అనుకూలించకపోవడంతో అక్కడకు వెళ్లాల్సిన ఇండిగో, స్పైస్‌జెట్ విమానాలు తిరిగి శంషాబాద్ చేరుకున్నాయి. మరోవైపు ఖతర్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద 14 కిలోల హైడ్రోఫోనిక్ గాంజా పట్టుబడింది. దీంతో వారిని అదుపులోకి తీసుకున్న అధికారులు.. విమానాశ్రయంలో తనిఖీలు చేపట్టారు.