VSP: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 163వ జయంతిని పురస్కరించుకుని విశాఖలోని కొమ్మాది వైఎస్సార్ కాలనీలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గాయత్రి మెడికల్ కాలేజ్ సహకారంతో డా.రవికిషోర్ నేతృత్వంలో వైద్య బృందం సుమారు 150 మందికి పైగా ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు అందించింది.