KDP: కమలాపురం మండలం అప్పాయపల్లెకు చెందిన గుండం రఘువర్థన్ రెడ్డి తన భార్య ఇంటిని తన పేరుపైకి మార్చుకునేందుకు 8 నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత కమిషనర్ బదిలీతో పని ఆగిపోయిందని, ప్రస్తుత కమిషనర్ ప్రహ్లాద్ పట్టించుకోవడం లేదని, డబ్బులు ఇస్తానన్నా పని జరగడం లేదని ఆయన తెలిపారు.