MNCL: బెల్లంపల్లి మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కారుకూరి రామచందర్‌పై వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు SHO శ్రీనివాసరావు ఇవాళ ప్రకటనలో తెలిపారు. ఓ TV ఛానల్ రిపోర్టర్ అందుగుల రమేష్‌ను మొబైల్ ఫోన్లో అసభ్యకరంగా దూషించినట్లు ఫిర్యాదు అందినట్లు పేర్కొన్నారు. రమేష్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు SHO వెల్లడించారు.