NLR: ఇందుకూరుపేట మండలంలో రేపు ఆదివారం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పర్యటించనున్నారు. కొత్తూరు పంచాయతీలోని, బీసీ కాలనీలో స్మశాన వాటికతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటారని ఎమ్మెల్యే కార్యాలయం ప్రకటనలో తెలిపింది. మండలంలోని నాయకులు కార్యకర్తలు తరలిరావాలని కోరారు.