VZM: గంట్యాడ మండలంలోని కొటారిబిల్లిలో అంగన్వాడీలకు 5జీ ఫోన్లను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఫోన్ల ద్వారా అంగన్వాడీ కేంద్రాల పనితీరులో పారదర్శకత పెరుగుతుందని, రికార్డుల నిర్వహణ సులభతరం అవుతుందన్నారు. ఇందులో DRDA పీడీ శ్రీనివాస్ పాణి, ఐసీడీఎస్ పీడీ విమలరాణి తదితరులు పాల్గొన్నారు.