SKLM: పొందూరు స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో శనివారం సివిల్ కోర్టు జడ్జి బి.జోష్న ఆధ్వర్యంలో మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వృద్ధుల హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలు చేస్తోందని తెలిపారు. వృద్ధులను నిర్లక్ష్యం చేయకుండా కుటుంబ సభ్యులు బాధ్యతగా చూసుకోవాలని సూచించారు.