NLR: సంగం మండల కేంద్రంలో హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. హిందూ ధర్మ పరిరక్షణే లక్ష్యంగా సమ్మేళనం ఘనంగా జరిగింది. గ్రామ పురవీధుల గుండా భారీ బైక్ ర్యాలీ ఉత్సాహంగా సాగింది. కాషాయ జెండాలు, ధర్మ నినాదాలతో సంగం వీధులు మార్మోగాయి. పలు సాంస్కృతిక కార్యక్రమాలతో చిన్నారులు అందరినీ అలరించారు. హిందూ సంప్రదాయాల పరిరక్షణపై ప్రసంగాలు తెలియజేశారు.