కృష్ణా: H. జంక్షన్ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రతి మంగళవారం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. స్థానికులతో పాటు వివిధ ప్రాంతాల భక్తులు విరాళాలు అందిస్తున్నారు. శాశ్వతంగా అన్నదానం నిర్వహించేందుకు ‘అభయాంజనేయ స్వామి అన్నదానం ట్రస్టు’ పేరిట రూ.50 లక్షల శాశ్వత నిధి ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.