అనంతపురం జేఎన్టీయూ పరీక్ష ఫలితాలు శుక్రవారం సాయంత్రం విడుదలయ్యాయి. బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఫార్మసీ పరీక్షా ఫలితాలను డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ శివకుమార్ విడుదల చేశారు. విద్యార్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా తమ ఫలితాలను చూసుకోవాలని అధికారులు సూచించారు.