కరీంనగర్ రూరల్ బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్ద అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న సయ్యద్ నవాబ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి, ట్రాక్టరును సీజ్ చేశారు. అలాగే గంజాయి విక్రయిస్తూ పట్టుబడిన ముగ్గురు బీటెక్ విద్యార్థులను రూ. లక్ష పూచీకత్తుపై తహసీల్దార్ ముందు బైండోవర్ చేశారు. చట్టవ్యతిరేక పనులకు పాల్పడితే రౌడీషీట్లు తెరుస్తామని సీఐ నిరంజన్ రెడ్డి హెచ్చరించారు.