ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్లో ఖాళీగా ఉన్న 13 సభ్యుల పోస్టుల ఎన్నికను ఆన్లైన్లో నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఆరు వారాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తిచేసేందుకు వీలుగా ఎన్నికల నిబంధనల్లో కొన్ని అంశాలను సడలించింది. ఇప్పటివరకు రూ.100 ఉన్న నామినేషన్ రుసుమును రూ.500కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.