TG: సంక్రాంతికి ప్రజలు ప్రశాంతంగా ఇళ్లకు వెళ్లేలా ఏర్పాట్లు చేసినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ‘HYD-విజయవాడ హైవేపై ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం. గత సంక్రాంతి సమయంలో AP వైపు 9 లక్షలకుపైగా వాహనాలు వెళ్లాయి. ఈసారి మరింత పెరిగే అవకాశం ఉంది. ట్రాఫిక్ జామ్ నివారణకు కలెక్టర్, SP, R&B అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలి’ అని సూచించారు.