WNP: దేశ మొదటి ముస్లిం మహిళ టీచర్ ఫాతిమా షేక్ బీబీ జయంతి మహనీయుల స్ఫూర్తివేదిక ఆధ్వర్యంలో వనపర్తిలో నిర్వహించారు. ఆమే చిత్రపటానికి పలువురు కవులు, కళాకారులు, టీచర్లు పూలమాలతో నివాళులర్పించారు. వేదిక అధ్యక్షుడు రాజారాం ప్రకాష్ మాట్లాడుతూ..సామాజిక సంస్కరణ వాది జ్యోతిరావు పూలే,సావిత్రిబాయి పూలేలతో కలిసి విద్యావ్యాప్తి చేసిన ఫాతిమా షేక్ బీబీ అని కొనియాడారు.