RR: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని కేశంపేట మండలం పోల్కోని గుట్ట తండా గ్రామ సర్పంచ్ భాస్కర్ నాయక్ తన సొంత ఖర్చులతో తండాలో ఎల్ఈడి లైట్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. సర్పంచ్‌గా ఎన్నికైన నాటి నుంచి అనేక సేవా కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరిగిందన్నారు.