KNR: సోషల్ మీడియాలో ‘వలపు వల’ విసిరి లక్షలు వసూలు చేస్తున్న భార్యాభర్తలను జిల్లా పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన వారితో లైంగిక సంబంధాలు పెట్టుకుని, ఆ దృశ్యాలను రహస్యంగా రికార్డ్ చేసి నిందితులు బ్లాక్మెయిల్కు పాల్పడుతున్నారు. బాధితుడి ఫిర్యాదుతో కరీంనగర్ రూరల్ పోలీసులు దంపతులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.