PLD: దాచేపల్లి మండలం మాదినపాడులో క్షుద్రపూజల ఘటన కలకలం రేగింది. అగ్రహారం వెళ్లే ప్రధాన రహదారిపై గుర్తు తెలియని వ్యక్తులు ముగ్గులు వేసి, మధ్యలో ‘శీలవతి’ అని రాసి పూజలు చేశారు. రోడ్డుపై కనిపిస్తున్న ఈ ఆకృతులను చూసి బుధవారం గ్రామస్థులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.