న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (112*) సెంచరీతో చెలరేగాడు. గిల్ (56) హాఫ్ సెంచరీతో రాణించాడు. రవీంద్ర జడేజా (27), రోహిత్ శర్మ (24), విరాట్ కోహ్లీ (23) పరుగులు చేశారు. న్యూజిలాండ్ టార్గెట్ 285.