AKP: కసింకోట మండలం తీడ గ్రామంలో బుధవారం ఎన్టీఆర్ తీర్థ మహోత్సవాన్ని అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ప్రారంభించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ పేరు మీదుగా గ్రామంలో తీర్థ మహోత్సవం నిర్వహించడం అభినందనీయం అన్నారు. గ్రామంలో మూడు రోజులు పాటు సంక్రాంతి సంబరాలను వైభవంగా నిర్వహిస్తామని గ్రామస్తులు తెలిపారు.