కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ గురువారం YSR జిల్లాలో పరిపాలన కారణాల రీత్యా ఇద్దరు ఎస్సైలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రొద్దుటూరు 1వ టౌన్ SI కె. శ్రీకాంత్‌ను ప్రొద్దుటూరు రూరల్‌కు, మైదుకూరు SI బి.అరుణ్ రెడ్డిని కడప VRకు బదిలీ చేశారు. వీరిని తక్షణమే రిలీవ్ చేసి, కొత్త స్థానాల్లో రిపోర్ట్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీని ఆదేశించారు.