TG: 2026లో జనాభా లెక్కలు జరుగుతాయని BJP రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. డీలిమిటేషన్ తర్వాతే 2028 సాధారణ ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. అసెంబ్లీ చర్చల్లో భాష చూస్తే జనం టీవీలు బంద్ చేస్తున్నారని విమర్శించారు. ప్రజాప్రతినిధుల భాష చూసి పిల్లలు కొత్తకొత్త బూతులు నేర్చుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణకు నీళ్ల విషయంలో నష్టం జరిగితే BJP ఊరుకోదని హెచ్చరించారు.