PDPL: హన్మంతునిపేట శివారులో దశాబ్దాలుగా నిర్వహిస్తున్న సమ్మక్క-సారలమ్మ జాతరకు రావాలని ఎమ్మెల్యే విజయరమణారావును జాతర కమిటీ ఆహ్వానించింది. శుక్రవారం కమిటీ ఛైర్మన్ పోల్సాని సుధాకర్ రావు ఆధ్వర్యంలో సర్పంచ్, సభ్యులు ఎమ్మెల్యేను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. వనదేవతల ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుతూ, జాతర ఏర్పాట్లపై ఎమ్మెల్యేతో చర్చించారు.