SKLM: మెలియాపుట్టి పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్లో ఉన్న పలు రికార్డులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, రాత్రి వేళల్లో ముమ్మరంగా గస్తీ నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు.