BPT: బాపట్ల మండలం సూర్యలంక సముద్ర ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు పరిశీలించారు. స్వదేశీ దర్శన్ 2.0 కింద రూ.97 కోట్లతో సూర్యలంక బీచ్‌ను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. పనులు నాణ్యతతో, వేగంగా పూర్తిచేసి సెప్టెంబర్ చివరి నాటికి ముగించాలని అధికారులను ఆదేశించారు.