బాపట్ల వైసీపీ ఇన్ఛార్జ్ కోన రఘుపతి గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ భేటీలో బాపట్ల నియోజకవర్గ పార్టీ పరిస్థితులపై చర్చించిన జగన్, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పార్టీ శ్రేణులతో కలిసి సమన్వయంతో పోరాడాలని ఆయనకు సూచించినట్లు తెలుస్తోంది.